Templates by BIGtheme NET
Home / News / పుణ్యక్షేత్రం గ్రామంలో ‘సైబీరియన్’ అతిధులు

పుణ్యక్షేత్రం గ్రామంలో ‘సైబీరియన్’ అతిధులు

Siberian

వేల కిలోమీటర్లు ప్రయాణించే పక్షులు ..
సంతానోత్పత్తి కోసం, ఆహారం కోసం వలసలు..
ఏకబిగిన వందల మైళ్లు ప్రయాణం..
దేశాలు.. ఖండాలు దాటి అనువైన చోటికి
శక్తి సామర్థ్యాలపై పరిశోధనలు..
ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలెన్నో…
అటువంటి వలస పక్షులు మన జిల్లాల్లోనూ..
అతిథిగా వస్తున్నాయి…

అక్కడ అతిథుల్ని ఆడబిడ్డలుగా చూసుకుంటారు. విదేశీ అతిథుల రాకతో ఆ గ్రామానికి కొత్త కళ వస్తుంది…

ఏటా పుట్టింటికి వచ్చినట్లు అతిథులు రావడంతో ఆ గ్రామంలో పండగ వాతావరణం నెలకుంటుంది. అతిథుల్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు. దీంతో ఆ గ్రామానికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అంతేగాక పర్యాటక కేంద్రంగా మంచి పేరు తెచ్చుకుంది. ఎవరా అతిథులు.. వాటి కోసం తెలుసుకుందామనుకుంటున్నారా…
అయితే పదండి…
వలస పక్షుల ‘పుణ్యక్షేత్రం’ రాజమండ్రికి కూతవేటు దూరంలో ఉంది. పుణ్యక్షేత్రమైన గ్రామం సైబీరియన్‌ వలస పక్షులకు పుట్టినిల్లు. ఇక్కడే తమ సంతతిని వృద్ధి చేసుకుని మళ్లీ పిల్లలతో సైబీరియన్‌కు పయనమౌతాయి. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ఈ వలస పక్షుల సందడి ఎక్కువగా ఉంటుంది. వందల కొద్దీ పక్షులు సమాహారం ఆకాశ వీధుల్లో విహారం చేస్తుంటే చూసేవారికి కన్నుల విందుగా ఉంటుంది. పొడవాటి ముక్కుతో మధ్యలో చేపపిల్ల పట్టేంత ఖాళీ ఉండే ఈ పక్షుల్ని చిల్లు ముక్కు కొంగలని పిలుస్తారు. గుడ్లు పెట్టి, పొదిగి, రెక్కలొచ్చేవరకూ సాకి, పిల్లల సహా తిరిగివెళ్తుంది. ఆడబిడ్డ మాదిరిగా జూలై, ఆగస్టులో ఎంత కచ్చితంగా వస్తుందో డిసెంబర్లో అంతే కచ్చితంగా పిల్లలతో వెళ్లిపోతాయి. రంపం మాదిరి ముక్కుతో తెల్లని రంగుతో రెక్కలపై నలుపురంగుతో చూడముచ్చటగా అందంగా ఉండే ఈ విదేశీ పక్షులను గ్రామస్తులు చాలా ప్రేమగా చూసుకుంటారు. పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డ మాదిరిగా ఆదరిస్తారు. వీటికి ఏదైనా జరిగినా అరిష్టంగా భావిస్తారు. అందుకే ఈ పక్షులకు ఎటు వంటి హానీ లేకుండా గ్రామస్తులు సంరక్షించు కుంటారు.

10154262_784521591599740_798562770086897781_n

ఈ పక్షులతో గ్రామస్తులకు అవినాభావ సంబంధం
ఈ పక్షులతో గ్రామస్తులకు అవినాభావ సంబంధం ఏర్పడింది. తమ తమ పెరట్లో వాలే ఈ పక్షులను ఎవరైనా తాకితే ఊరుకోరు. వేటాడాలని చూస్తే దేహశుద్ధి తప్పదు. ఈ పక్షుల రెట్టల వేడికి చెట్లు కుశించి, నశించినా సరే ఏమీ చేయరు. ఈ విధంగా ఎన్నో చెట్లు పోయాయి కూడా. ఈ పక్షుల కోసం ఊళ్లోని ఖాళీ స్థలంలో చెట్లను పెంచి మరీ తమబంధాన్ని గ్రామస్తులు చాటుకున్నారు.

1237799_598830916835476_170822174_n

రాజకీయాలు ఈ పక్షుల్నీ తాకాయి
ఈ పక్షులు నివసించే చెట్లు తొలగించి ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు ఆ మధ్య ప్రతిపాదించి ఆ దిశగా చర్యలు తీసుకున్న సమయంలో గ్రామస్తులు కోర్టు వరకూ వెళ్లి, అడ్డుకున్నారు. కొంతకాలం కోర్టు వివాదాల్లో నలిగి మొత్తానికి పక్షల రక్షణకు చర్యలు చేపట్టారు. ఫలితంగా ఒక మనిషిని కాపలా పెట్టారు.

తుపాను కష్టాలనూ చూసిన పక్షులు
1996 నవంబర్‌లో వచ్చిన నాటి తుపాను దెబ్బకు చెట్లు విరిగిపోయాయి. గూళ్లలోని పక్షి పిల్లలు చచ్చిపోయాయి. పక్షి పిల్లల వల్ల రోగాలు వస్తాయన్న భయంతో గ్రామస్తులు వాటిని పూడ్చిపెట్టారు.

10VZVISKREG1AIR__G_1139038f

సర్కారు పట్టించుకోవాలి
స్థానికుల ఈ పక్షుల రాకతో ఈ కుగ్రామానికి రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరువచ్చింది. ఇవి సంతతిని వృద్ధి చేసుకుని తిరిగి వెళ్తున్నప్పుడు బాధతో వీడ్కోలు పలుకుతుంటారు. ప్రభుత్వపరంగా సంరక్షణ కేంద్రాల ఏర్పాటు చేస్తే పర్యాటకంగా ఈ గ్రామం చాలా అభివృద్ధి చెందుతుందని స్థానికులు అంటున్నారు. ఇక్కడ చెట్ల కంటే విద్యుత్‌ హైటెన్షన్‌ పోల్స్‌ పెరిగిపోవడం వల్ల వీటి ఉనికికే ప్రమాదం వాటిల్లేలా ఉంది. వీటిని చూసేందుకు ఇతర ప్రాంతాల ఉంచి వచ్చే పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Source - http://www.prajasakti.com/index.php?srv=10301&id=1333165

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful