Templates by BIGtheme NET
Home / ARTICLES / బండి పై రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బాలురు

బండి పై రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బాలురు

హైదరాబాద్‌ను చూసేందుకు ఇంట్లో చెప్పకుండా రాజమహేంద్రవరం నుంచి ద్విచక్రవాహనంనపై వచ్చి పోలీసులకు చిక్కిన బాలుర ఉదంతమిది. వారి నుంచి రూ.1,25,422/- నగదు, రెండు ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నికేష్, కడియాల విజయ్‌లు ఇద్దరు మంచి మిత్రులు. హైదరాబాద్ నగర అందాలు ఇక్కడ ప్రసిద్ధిగాంచిన చార్మినార్, జూపార్కు, వండర్‌లా తదితర ప్రదేశాలను చూడాలనే కోరిక పుట్టింది. దీంతో కనపర్తి వెంకట్ నికేష్ పథకం రచించాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక 12:30 గంటల సమయంలో ఇంట్లో వారు పడుకున్నది చూసి ఇంట్లోని రూ. 1.60 లక్షల నగదుతో పాటు తన బావ వంశీదినేష్‌కు చెందిన యాక్టివా వాహనాన్ని తీసుకున్నాడు. మిత్రుడైన భాను విజయ్ వద్దకు వెళ్లి ఇద్దరు కలిసి 1 గంట సమయంలో యాక్టివా హోండాపై రాజమండ్రి నుంచి నగరబాట పట్టారు. మార్గమధ్యలో కొవ్వూరు, ఏలూరుతో పాటు మరో ప్రాంతంలో మూడు సార్లు బైకులో పెట్రోల్ ఫుల్‌ట్యాంకు చేయించుకున్నారు.
ఇద్దరు డ్రైవింగ్ చేస్తూ సుమారు 430 కిలోమీటర్ల మేర ప్రయాణించి వనస్థలిపురం ప్రాంతానికి ఉదయం 9 గంటల సమయానికి చేరుకున్నారు. తమ వద్ద ఉన్న డబ్బుతో రూ. 30 వేలతో 2 స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేశారు. అనంతరం సినిమాకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుని సమీపంలోని ఓ థియేటర్‌లో అర్జున్‌రెడ్డి సినిమా చూసేందుకు రెండు సినిమా టికెట్లు కొనుగోలు చేశారు. సినిమా ప్రారంభమయ్యేందుకు సమయం ఉండటంతో బైకుపై ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు ప్రాంతానికి చేరుకున్నారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులకు నెంబర్ లేని యాక్టివా హోండా బైకుపై ఉన్న ఇద్దరు బాలురు అనుమానాస్పదంగా కనపడ్డారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

వాహనంలో ఉన్న చిరునామా ఆధారంగా వెంకట్‌ నికేష్‌ మేనమామకు పోలీసులు సమాచారమిచ్చారు. వారు తమ పిల్లలే అనీ.. రాజమహేంద్రవరం నుంచి అర్ధరాత్రి బయలుదేరారని, పట్టుకొని ఉంచాలని కోరారు. విస్తుపోయిన పోలీసులు బాలుర కోసం వెతికారు. వాహనం డిక్కీలో నగదుతోపాటు సినిమా టికెట్లు సైతం బయటపడటంతో ఎలాగైనా థియేటర్‌ వద్దకు వస్తారని పోలీసులు మాటువేశారు. అనుకున్నట్లుగానే అక్కడికి చేరుకున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్‌ ఠాణాకు తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful