Templates by BIGtheme NET
Home / News / రాజమండ్రిలో ఎన్నారై కిడ్నాప్‌..ఛేదించిన కృష్ణా జిల్లా పోలీసులు

రాజమండ్రిలో ఎన్నారై కిడ్నాప్‌..ఛేదించిన కృష్ణా జిల్లా పోలీసులు

రాజమండ్రిలో మలికిపురానికి చెందిన ఎన్నారై వ్యక్తిని గుర్తు తెలియని అగంతకులు కిడ్నాప్‌ చేశారు. విదేశాలకు అమ్మాయిలను విక్రయిస్తున్నాడని, తాము పోలీసులమంటూ దర్జాగా అపహరించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు దుండగుల ఆటకట్టించారు. బుధవారం రాజమండ్రిలో సంచలనం రేకెత్తించిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి..

రాజమండ్రి పాత సోమాలమ్మ ఆలయ సమీపంలో ఇంటీరియర్‌ డెకరేషన్‌ షాపు వద్ద మలికి పురానికి చెందిన ప్రవాసాంధ్రుడు రాపాక చక్రవర్తి ఏపీ 28బీఎఫ్‌ 6336 నెంబరు స్కోడా కారులో వెళుతుండగా బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు 8 మంది యువకులు బైక్‌లపై వచ్చి అకస్మాత్తుగా దాడి చేశారు. స్థానికులు అడ్డుకోవడంతో చక్రవర్తి అమ్మాయిలను ఇతర దేశాలకు అమ్ముతున్నాడని తామంతా పోలీసులమని చెప్పారు. దీంతో స్థానికులు పట్టించుకోలేదు. వెంటనే అదే కారులో చక్రవర్తిని తీసుకుని వారు వెళ్ళిపోయారు. అయితే, దుండగులు తాము పోలీసులమని చెప్పడం వరకు బాగానే ఉన్నా.. చక్రవర్తిని రక్తాలు వచ్చేటట్టు కొట్టడం అనుమానాలకు తావిచ్చింది.

స్థానికుల ఫిర్యాదు చేయడంతో రాజమండ్రి పోలీసులు తక్షణమే గాలింపు చేపట్టారు. సమాచారం అందుకున్న కృష్ణా జిల్లా పోలీసులు కిడ్నాప్‌ను ఛేదించారు. కృష్ణాజిల్లా నందివాడ సమీపంలో కిడ్నాపర్‌లు ప్రయాణిస్తున్న స్కోడా కారును గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్‌నకు వినియోగించిన కారు హైదరాబాద్‌లో ఒక లేబొరేటరీకి చెందిందని గుర్తించారు.

అగంతకులు హైదరాబాద్‌కు చెందిన రౌడీ గ్యాంగ్‌ సభ్యులు అయి ఉంటారని తెలుస్తోంది. కాగా, ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగం ఇప్పిస్తానని తమ వద్ద రూ. 10లక్షలు తీసుకుని చక్రవర్తి మోసం చేశాడని, అలాగే వివాహం చేసుకుంటానని ఒక యువతిని మోసగించి పరారయ్యాడని అందుకే.. అతడిని పట్టుకున్నామని కిడ్నాపర్‌లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రాజమండ్రి పోలీసులకు అప్పగించేందుకు కృష్ణా జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు.

Source – Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful