Templates by BIGtheme NET
Home / News / రియల్ సెలబ్రిటీ శ్రీ బి. శ్రీనివాస్

రియల్ సెలబ్రిటీ శ్రీ బి. శ్రీనివాస్

13051627_985197991564132_2570226218695726610_n  

సమయం : సాయంత్రం 5.45,ఏప్రిల్ 24,రాజమండ్రి స్టేషన్ . .

పూరి వెళ్ళే గరీబ్ రథ్ కి గార్డ్ బోగి కింద ఉన్నవీల్ దగ్గిర జాయింట్ ( నాకు తెల్సిన భాష వాడ్తున్నా) తీవ్రమైన ఎండ వేడికి ఎదో తేడా కి గురి అయ్యిందని, రైలు రాగానే అన్ని వీల్స్ verify చేసే మెకానిక్ కనిపెట్టటంతో బయలుదేరడానికి సిగ్నల్ ఇవ్వబడ్డ రైలు ఆగిపోయింది.

ఆ మెకానిక్ రైలు బోగి కిందకి దూరి సుమారు 18 నిమిషాలు ఆపకుండా శ్రమ పడి ఈ జాయింట్ రిమూవ్ చేయటం నేను చూసాను. పైన ఉన్నది విపరీతమైన ధ్వని వస్తోన్న జనరేటర్ బోగి. 42 డిగ్రీల వేసవి వేడి. చీకటి పడిపోయింది, చిన్న బ్యాటరి వెలుగులో రైల్వే మెకానిక్, ( పేరు బి. శ్రీనివాస్ ట,) మొత్తానికి రిపేర్ చేసాడు.

రిపేర్ అయిపోయాక బయటకొచ్చి, బోగి పక్కన కూచొని ఎంతసేపు రోప్పాడో పాపం. అతని ఉద్యోగ ధర్మమే అవవచ్చు, మనలాటి ప్రాణే.. ఐనా సరే, ఎంత నెప్పిగాఉన్నా, ఎంత వేడి ఉన్నా, తన డ్యూటీ కి న్యాయం చేసాడు. అతనే గనక ఇది గమనించక పొతే ఎలాటి ప్రమాదం అయినా జరిగే అవకాశంఉందని తోటి మెకానిక్స్ చెప్పారు. ప్రజలని కాపాడే వారు సెలిబ్రిటీస్ అవుతారు తప్ప, ప్రజల మీద బ్రతికే వారు కాదు. ఏమంటారు??  

13095801_985197988230799_8870284597016046527_n

13077078_985198111564120_4889971925075505777_n

రాసినవారు – పిశిపాటి రవీంద్ర శ్రీనివాస్, INTUC ఆఫీస్ సెక్రటరీ, తూర్పుగోదావరి జిల్లా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful