Templates by BIGtheme NET
Home / News / నేడు సంఖ్యా మాంత్రికుడు రామానుజన్ జయంతి

నేడు సంఖ్యా మాంత్రికుడు రామానుజన్ జయంతి

Ramanujan

రోజు మన భారతదేశం గర్వించదగ్గ సంఖ్యా మాంత్రికుడు,  శ్రీనివాస్ రామానుజన్ జన్మదినం.   సందర్బముగా మనం ఆయనని గుర్తుచేసుకుందాం. రామానుజన్ శుద్ధ గణితం లోను నెంబర్ థీరి ముఖ్యమైన పరిశోదనలు  శ్రీనివాస రామానుజన్ 22/12/1887 లో శ్రీనివాస అయ్యంగార్కోమలత్తమ్మాళ్ పుణ్యదంపతులకు తమిళనాడులోని రోడ్లో జన్మించెనుతన తండ్రి బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవాడు. అతని తండ్రి సంపాదించే జీతంతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది. రామానుజన్ చిన్నతనం నుండే విశిష్ట లక్షణాలు కలిగి వుండేవాడుపెద్ద పెద్ద లెక్కలని కూడా కాగితం, పెన్సిలు వాడకుండా మనసులోనే చెయ్యగల అసామాన్య నైపుణ్యం కలిగివున్నాడు.  అతను చిన్నవయసులోనే ప్రముఖమైన  ఆయిలర్ సూత్రాన్ని (exp(ix) = cos(x) + i sin(x) ) రామానుజన్ కనుక్కున్నాడు.  చిన్నతనమునుమ్డే అద్భుత ప్రతిభను ప్రదర్శించేవారు రామానుజన్.  జార్జ్ కార్ అనే వ్యక్తి రాసిన అవిశేషమైన గణిత పుస్తకం రామానుజన్ కి ఆధునిక గణితానికి మొట్టమొదటి పరిచయ గ్రంథం అయ్యింది. అంత వరకు బడి చదువుల్లో తిప్పలు పడుతూ, కాలేజిలో చేరడానికి ప్రవేశ పరీక్షల్లో డింకీలు కొట్టిన రామానుజన్, పుస్తకాన్ని సునాయాసంగా అవపోసన పట్టాడు. అక్కడితో ఆగక పుస్తకంలో లేని కొత్త సుత్రాలని కనిపెట్టసాగాడుతన అసమాన ప్రతిభాపాటవాలు రామానుజన్ కి హై స్కూలు స్థాయిలో ప్రత్యేక పారితోషకాన్ని తెచ్చిపెట్టాయి.

రామానుజన్ మద్రాసులోని పోర్ట్ ట్రస్ట్ లో చిన్నగుమాస్తా ఉద్యోగం సంపాదించాడు. జీతం కూడా బాగా తక్కువ. జీతం తక్కువైనా ఉద్యోగం వల్ల తనకి అత్యంత ప్రియమైన గణితంలో మునిగిపోవడానికి బోలెడంత తీరిక దొరికేది. తనకు దొరికిన తీరిక సమయంను పూర్తిగా సంఖ్యా మేజిక్ చేయటానికి ఉపయోగించుకున్నారు.  నిరంతరం సంఖ్యా ప్రయోగములు చేసేవారు దశలోనే రామానుజన్ తను కొత్తగా కనుక్కొన్న కొన్ని గణిత ఫలితాలని ముగ్గురు ప్రఖ్యాత బ్రిటిష్ గణితవేత్తలకి పంపాడు. పెద్దగా చదువుకోని ఎవరో అనామక భారతీయ గుమాస్తా రాసిన ఉత్తరాన్ని, వారిలో ఇద్దరు గణితవేత్తలు చూసీచూడకుండానే చెత్త బుట్టలో పారేశారు. మూడవ గణితవేత్త మాత్రం పొరబాటు చెయ్యలేదు.    

ఫిబ్రవరి 28, 1918లో రామానుజన్ ని ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీగా ఎన్నుకున్నారు. ఇదే సంవత్సరం అక్టోబర్ లో ఈయనకు ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గా ఎన్నుకున్నారు. ఇది చాలా అరుదైన విషయం. ఈయన బీజ గణితంలో సాధించిన సమీకరణాల వల్ల యూలర్, జాకోబి వంటి గొప్ప శాస్త్రజ్ఞుల కోవలోకి చేరాడని కేంబ్రిడ్జిలో ఎంతో మంది చెప్పుకునేవారు. క్షయ సోకడంతో రామానుజన్ ఇంగ్లాండు నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఏప్రిల్ 26, 1920 చనిపోయేనాటి వరకు గణితంలో నిత్యం చిత్రవిచిత్రమైన అంశాలను ఆవిష్కరిస్తూ వుండేవాడు. ఈయనకు ఎనలేని దైవచింతన వుండేది. దైవం, శూన్యం, అనంతం ఇలాంటి అంశాల మీద ఉపన్యాసాలు కూడా ఇచ్చేవాడుశ్రీనివాస రామానుజన్అనగానే గుర్తుకొచ్చేది 32 ఏళ్లలోనే పేదరికాన్ని, ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలు గడించిన సహజ గణితశాస్త్ర మేధావి‘. ఈయన జీవితచరిత్ర యువ మేధావులకు ఎంతో స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా స్ఫూర్తి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారిలో విజయాల్ని సాధించాలనే పట్టుదలను పెంచుతుంది.

Text Source – http://laharicom.blogspot.in/2013/12/blog-post_7101.html#.Vnjqbvl97IU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful