Templates by BIGtheme NET
Home / ARTICLES / వానొస్తే చెట్టు కిందకి వెళ్లొద్దు,పిడుగుతో జాగ్రత్త!

వానొస్తే చెట్టు కిందకి వెళ్లొద్దు,పిడుగుతో జాగ్రత్త!

vana

రోడ్డు మీద వెళ్తుంటాం! అంతలో చినుకు మొదలవుతుంది. చూస్తుండగానే వేగం పెరిగి వానగా మారుతుంది. వెంటనే దగ్గర్లో ఏదైనా చెట్టుఉందేమో చూసి దాని కిందకి పరిగెడతాం! కానీ.. చెట్టు అన్నిసార్లూ సురక్షితం కాదు. అందునా చుట్టూ అంతగా ఎత్తైన కట్టడాలు, వేరే చెట్లు లేని ప్రదేశంలో ఉండే చెట్ల కిందకు వెళ్తే.. పిడుగుపాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. ఎత్తైన కట్టడాలు, చెట్లపైనే పిడుగులు పడతాయి. ఆదివారం ఒక్కరోజే ఏపీలో 22 మంది పిడుగుపాటుకు బలి కావడమే ఇందుకు నిదర్శనం. అయితే.. కాస్తంత అప్రమత్తంగా ఉంటే పిడుగుపాటు ముప్పునకు దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

  •  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తే చెట్ల కిందకు చేరొద్దు.
  •  ఇలాంటి సమయంలో రైతులు పొలాల వద్ద నుంచి త్వరగా ఇంటికి చేరుకోవాలి.
  •  ఎత్తయిన ప్రదేశాల్లో ఉండకూడదు.
  •  ఎడ్లబండి, ద్విచక్ర వాహనం, ట్రాక్టర్వంటి వాహనాలు నడపకూడదుఎక్కువగా నీళ్లున్నచోట ఉండకూడదు. నీళ్లలో ఈత కొట్టకూడదు.
  •  సెల్ఫోన్‌, కెమెరా వాడకూడదు
  •  ఇంట్లో ఉన్నప్పటికీ.. అత్యవసర పరిస్థితుల్లో తప్ప లాండ్లైన్ఫోన్వినియోగించడం కూడా శ్రేయస్కరం కాదు.
  •  మెరుపులతో చుట్టు పక్కల విద్యుత్తీగలు కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి.. పిడుగులు పడే సమయంలో టీవీలకు ఉన్న విద్యుత్తీగలను, ఇంటర్నెట్‌, టెలిఫోన్కేబుళ్లను తొలగించడం మంచిది.
  •  వర్షం పడుతున్న సమయంలో విద్యుత్తీగల కింద, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో ఉండకూడదు.
  •  ఎర్తింగ్తో కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం. అలాంటి సమయంలో చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదు.
  •  గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు వర్షం పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
  •  ఇళ్లు, పొలం ఆవరణలో కాపర్ఎర్త్ఏర్పాటు చేసుకోవాలి
  •  పిడుగుపాటు నుంచి తప్పించుకునేందుకు కాపర్ఎర్త్‌ – రాగి తీగను ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని పై నుంచి భూమి లోపలి వరకూ ఏర్పాటు చేసుకోవాలి. దీంతో కిలోమీటరు దూరంలో పిడుగు పడినా భూమి అకర్షించుకుంటుంది. కాపర్తీగను ఏర్పాటు చేసుకునే సమయంలో ఉప్పుతో పాటు, బొగ్గు కలిసి అందులో వేయాలి. శక్తివంతమైన విద్యుత్ప్రవాహం పిడుగు రూపంలో కిందికి వచ్చినప్పుడు కాపర్తీగ ఆపే అవకాశం ఉంది. టవర్లు, సినిమా హాళ్ల వద్ద ఇలాంటివి ఎక్కువగా ఏర్పాటు చేస్తారు.
  •  పెద్ద పెద్ద భవనాలు, పరిశ్రమల పైభాగంలో రాగి కడ్డీలను ఏర్పాటు చేసుకోవాలి. రాగి, ఇనుము కలిపిన కడ్డీలను భూమిలోకి పాతుకోవడం వల్ల అవి పిడుగులను అకర్షించి భూమిలోకి చేరవేస్తాయి.

పిడుగు.. 2లక్షల వోల్టుల తీవ్రతతో..
మెరుపుల ద్వారా ఏర్పడే అత్యధిక విద్యుత్‌ ప్రవాహమే పిడుగు. ఒక మిల్లీ సెకన్‌ కాలంలో మెరుపులతో కూడిన పిడుగు 20 ఆంపియర్ల విద్యుత్‌ ప్రవాహాన్ని వెలువరుస్తుంది. అప్పుడు ఏర్పడే క్షేత్ర తీవ్రత మిటర్‌కు 2 లక్షల వోల్టులతో సమానం. ఇది ఒక లక్ష కిలోమీటర్ల పొడువుంటుంది. రెండు మేఘాల మధ్య అయితే తక్కువలో తక్కువ 7 నుంచి 140 కిలోమీటర్ల దూరం ఉంటాయి.

Text Source – Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful