Templates by BIGtheme NET
Home / News / దొరకని సూది సైకో..రెండో ఊహాచిత్రం విడుదల….నిన్నతూర్పు గోదావరిలో సిరంజి సైకో దాడి..

దొరకని సూది సైకో..రెండో ఊహాచిత్రం విడుదల….నిన్నతూర్పు గోదావరిలో సిరంజి సైకో దాడి..

sdsadaf-647x450

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీసులకు నిన్న సైకో ‘సూది’గాడు దొరికాడన్న వార్తల్లో నిజం లేదట. సైకో ఇంకా తమకు దొరకలేదని సాక్షాత్తు ఆ జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. పనిలో పనిగా సైకో సూదిగాడి ఊహాచిత్రాన్ని మరోమారు విడుదల చేసిన ఆయన, సైకో రూపం ఎలా ఉంటుందన్న విషయంపైనా సుదీర్ఘంగా వివరించారు.

5.8 నుంచి 5.10 అడుగుల ఎత్తు ఉండే సైకో, దాదాపు 72 కిలోల బరువు ఉంటాడని, వయస్సు 25 నుంచి 30 మధ్య ఉంటుందని ఎస్పీ చెప్పారు. అంతేకాక, ఇప్పటిదాకా సైకో తాను పాల్పడ్డ అన్ని దాడుల్లో బ్లాక్ కలర్ హోండా షైన్ బైక్ పైనే వచ్చాడని, దాడి తర్వాత అదే బైక్ పై పారిపోయాడని కూడా ఎస్పీ చెప్పారు. ఇక సైకో ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డుగా అందించనున్నట్లు ఎస్పీ ప్రకటించారు.

తూర్పులోనూ సిరంజి సైకో

సూదిగాడు పశ్చిమం నుంచి తూర్పు గోదావరిలో దాడి మొదలు పెట్టాడు. పశ్చిమ గోదావరిలో ఇన్నాళ్ళు దాడులు చేసి హడావుడీ చేసిన సైకో కోసం గాలింపు ఎక్కువ కావడంతో తన దృష్టి మార్చుకున్నాడు.
పశ్చిమ గోదావరి జిల్లాలో సిరంజి సైకో దాడులు జరుగుతూనే ఉన్నాయి. అతడిని పట్టుకునేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోనూ ఈ సిరంజి దాడులు మొదలయ్యాయి. కానీ, ఈసారి ఒక మహిళ యువకుడిపై దాడి చేసింది. సామర్లకోట పట్టణంలో బుధవారం రాత్రి 8 గంటలకు సంగీతరావు పేటకు చెందిన దుర్గాప్రసాద్‌(25) వద్దకు ఒక మోటార్‌సైకిల్‌పై ఒక పురుషుడు, సీత్ర వచ్చి పిఠాపురం వెళ్లే దారి చెప్పాలని అడిగారు. అతడు సమాధానం చెప్పేలోగానే వెనుక ఉన్న మహిళ సిరంజితో అతడి చేతిపై దాడిచేసింది.
దుర్గాప్రసాద్‌ ఏం జరుగుతుందో తెలుసుకునే సమయంలోనే వారిద్దరూ మోటార్‌సైకిల్‌పై పరారయ్యారు. మహిళ పసుపు రంగు చీర ధరించిదని, పురుషుడు నలుపు కళ్లజోడుతో ఉన్నాడని బాధితుడు తెలిపాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పశ్చిమగోదావరిజిల్లాలో సైకో దాడిలో గాయపడిన మహిళ మళ్లీ అస్వస్థతకు గురవడంతో ఆమెను భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. సిరంజి సైకో ఊహాచిత్రాన్ని రూపొందించినట్లు జిల్లా ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ తెలిపారు.
Source - Ap7am.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful