Templates by BIGtheme NET
Home / News / రాజమండ్రిలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రాంతీయ విభాగం ఏర్పాటుకు మంత్రి హామీ!!!

రాజమండ్రిలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రాంతీయ విభాగం ఏర్పాటుకు మంత్రి హామీ!!!

6204508010_c21059a50a_b

నాటక రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి కళాకారులను తయారు చేయటంలో కీలకపాత్ర పోషిస్తున్న నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రాంతీయ విభాగాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేయడానికి కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మహేష్ వర్మ సూత్రప్రాయంగా అంగీకరించారు. సాంస్కృతిక రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ప్రాముఖ్యతను పరిగణిం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రాంతీయ విభాగాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివారావు, కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్‌శర్మకు అందజేశారు.

ఆదికవి నన్నయ, కందుకూరి విరేశలింగం వంటి మహానీయుల గడ్డ, కళలకు కాణాచి అయిన రాజమహేంద్రవరంలో ఈ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, దీనిపై అధ్యయనం చేసి నివేదికను తయారు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్టు కంభంపాటి వెల్లడించారు.

Source - http://www.andhrabhoomi.net/content/national-school-drama

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful