Templates by BIGtheme NET
Home / News / మోరంపూడి ఫ్లైఓవర్‌ నిర్మాణంకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌.

మోరంపూడి ఫ్లైఓవర్‌ నిర్మాణంకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌.

Source - Express TV

Source – Express TV

రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులకు ఎట్టకేలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఫ్లైఓవర్‌ నిర్మాణానికి కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ 44 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు హామీ ఇచ్చారు. దీంతో రాజమండ్రి ప్రజల రహదారి కష్టాలు తీరనున్నాయి.

డేంజర్ జంక్షన్‌గా ముద్రపడిన రాజమండ్రి మోరంపూడి వద్ద ఒక ఏడాదిలో జరిగిన రోడ్డు ప్రమాదాలు. చెన్నై – కోల్‌కతా 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న కూడళ్లలో ఎక్కువ సంఖ్యలో రోడ్ యాక్సిడెంట్‌లు నమోదైంది ఈ ప్రదేశంలోనే.ఈ ఏడాది మేలో  స్కూల్ బస్సు అదుపుతప్పటంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం ఒక్కటే శాశ్వత పరిష్కారం అనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.

విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో కేంద్రం రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్‌పై కూడా సానుకూలంగా స్పందించారు. రాజమండ్రి ప్రజాప్రతినిధులు  చేసిన విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టుకు సూతప్రాయంగా అంగీకారం తెలపటమే కాకుండా నిధులు కూడా  కేటాయించారు. అయితే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం హైవే విస్తరణలో భాగంగా చేపట్టనున్నారా లేక ప్రత్యేక ప్యాకేజ్‌గా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

Source - http://www.ntvpost.com/news/centre-sanctions-flyover-rajahmundry-10901

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful