Templates by BIGtheme NET
Home / News / అలనాటి సీత ‘అంజలీ దేవి’ గారి జయంతి నేడు.

అలనాటి సీత ‘అంజలీ దేవి’ గారి జయంతి నేడు.

Anjali Devi_F80FBB-C20B48

సీతమ్మ తల్లి ఇలాగే ఉంటుందా అనిపించే ఆ అందాల నటి అంజలి దేవి. నేడు ఆమె జయంతి. ఈ సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు…
అంజలీదేవి 1950-75 తరానికి చెందిన సినిమా నటీమణి, నిర్మాత. ఈమె తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం గ్రామంలో 1927 ఆగస్టు 24 తేదీన జన్మించారు. అంజలీదేవి అసలు పేరు అంజనీ కుమారి. అంజలీదేవి నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఈమె భర్త పి.ఆదినారాయణరావు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ సంగీత దర్శకుడు. సినీరంగానికి చేసిన సేవలకు అంజలీ దేవి 2006లో రామినేని ఫౌండేషన్‌ వారి విశిష్ట పురస్కారం, 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకుంది.

బాల్యంలోనే కాకినాడలోని యంగ్‌మెన్‌ హ్యాపీక్లబ్‌లో చేరి నాటకాలు వేశారు. ఎనిమిదేళ్ల వయసులోనే నటనారంగంలో అడుగుపెట్టారు. హరిశ్చంద్ర నాటకం ప్రదర్శిస్తున్న రోజుల్లో ఆమెకు సంగీత దర్శకుడు ఆది నారాయణరావుతో పరిచయమైంది. కాకినాడ యాంగ్‌మెన్స్‌ హ్యపీ క్లబ్‌ తరఫున నాటకాలు వేసే అంజలీ దేవి ఓనాడు సన్నగా రివటలా చురుగ్గా వున్న ఓ అబ్బాయితో కలిసి రుక్మిణిగా నటించింది. ఆ తరువాత వాళ్లద్దరూ హీరో హీరోయిన్‌లుగా వెండితెరపై కన్పించారు ఆ అబ్బాయి పేరు అక్కినేని నాగేశ్వరరావు. 1947లో కృష్ణవేణి నిర్మించిన గొల్లభామ సినిమాలో ఒక డ్యాన్సర్‌గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. మొదట్లో అంజలీ దేవిగారు చిన్న చిన్న పాత్రలే ధరించారు తుఫానుకు ముందు చిరుజల్లులు తాంపరలు పడ్డట్టుగా ఈ మహానటి కొన్ని చిన్నచిత్రపాత్రల తరువాత పల్లెటూరి పిల్ల చిత్రం ద్వారా హీరోయిన్‌గా నటించింది.

ఎల్‌.వి.ప్రసాద్‌ నిర్మించిన ‘కష్టజీవి’ సినిమాతో హీరోయిన్‌ అయ్యారు. 1950లో ఘంటసాల బలరా మయ్య తీసిన ‘శ్రీలక్ష్మమ్మ కథ’తో అంజలీదేవి గుర్తింపు వచ్చింది. ఇదే సంవత్సరం బి.ఏ. సుబ్బారావు తీసిన ‘పల్లెటూరి పిల్ల’ చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటించి ఈ రెండు సినిమాలు బాగా విజయవంతం కావడంతో ఆమె కెరీర్‌బాగా ఊపందు కుంది. సంగీత దర్శకులు ఆదినారాయణరావును వివాహం చేసుకుంది. అంజలీదేవి పిక్చర్స్‌ను స్ధాపించి, ఎన్నో హిట్‌ సినిమాలు నిర్మించారు.

1953లో ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళభాషల్లో ‘పరదేశి’ అనే సినిమా నిర్మించారు. ఈ తమిళ సినిమా ద్వారానే శివాజీగణేశన్‌ పరిచయమయ్యారు. అంజలీదేవి అలనాటి అగ్రనటులైన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావులతో కలిసి ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించారు. ‘లవకుశ’ సినిమాలోని సీత పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాగే ఆమె నటించిన కీలుగుర్రం, సువర్ణసుందరి, అనార్కలి లాంటి చిత్రాల్ని, అందులోని ఆమె నటనను తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మర్చిపోలేరు. మహానటులైన అక్కినేని, నందమూరిల సరసన హీరోయిన్‌గానే కాకుండా వారికి తల్లిగా కూడా కొన్ని సినిమాల్లో నటించడం ఓ విశేషం. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అంజలీదేవికి 2005లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2006లో రామినేని అవార్డు, 2007లో ప్రతిష్టాత్మకమైన అక్కినేని నాగేశ్వరరావు అవార్డులు లభించాయి. 1994లో అంజలీదేవి ’పోలీస్‌ అల్లుడు’ సినిమాలో నటించిన తర్వాత, మళ్లీ ఏ సినిమాలోనూ నటించలేదు.

అంజలీ దేవి నటించని పాత్ర అంటూ లేదంటే అతిశంచక్త కాదు. తన వయసుకు మించిన పాత్రల్ని కూడా ఆ రోజుల్లోనే నటించి మెప్పించారు చిత్రరంగంలో తొలి తెలుగు గ్లామర్‌ నాయిక అంటే అంజలీ దేవే. ఆ రోజుల్లోనే అంజలీ దేవి అక్షరాలా ముప్పయ్‌వేల రూపాయలు పారితోషకం తీసుకున్న దాంటే ఆవిడెంత బిజీ క్రేజ్‌వున్ననటో అర్ధం చేసుకోవొచ్చు.

అంజలీ దేవి చెన్నైలో జనవరి 13, 2014 న, 86 సంవత్సరాలు వయస్సులో మృతి చెందారు.

Source - http://www.suryaa.com/main/features/Article.asp?category=4&subCategory=2&ContentId=151038

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful