Templates by BIGtheme NET
Home / News / రాజమండ్రిలో ‘చుట్టాలబ్బాయి’

రాజమండ్రిలో ‘చుట్టాలబ్బాయి’

DSC_8053

ఆది కథానాయకుడుగా ‘గరం’ తర్వాత చేస్తున్న సినిమా ‘చుట్టాలబ్బాయి’. నమిత ప్రమోద్‌ కథానాయికగా చేస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ తాజా షెడ్యూల్‌ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరగనుంది. వీరభద్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను రాము తాళ్లురి, వెంకట్‌ తలారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూర్తిగా కుటుంబ కథా చిత్రమని దర్శకుడు వీరభద్రమ్‌ చెబుతున్నారు.

ఇటీవల ఇంట్రడక్షన్‌ సాంగ్‌ను బ్యాంకాక్‌లో చిత్రీకరించినట్టు ఆయన తెలిపారు. ”ఆది, నమిత ప్రమోద్‌, విలన్‌ పాల్గొనే సన్నివేశాలను గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం. ఒక పాటను, ఫైట్‌ను షూట్‌ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరినీ ఆకుట్టకునే కుటుంబ కథా చిత్రమిది” అని వీరభద్రమ్‌ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌, సినిమాటోగ్రఫీ : ఎస్‌. అరణ్‌కుమార్‌, ఆర్ట్‌ : నాగేంద్ర, ఎడిటింగ్‌ : ఎస్‌.ఆర్‌. శేఖర్‌, మాటలు : భవాని ప్రసాద్‌.

Source - Prajasakthi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful